HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gopichand Changed The Story Of Balayyas Film

బాలయ్య సినిమా..కథనే మార్చేసిన గోపీచంద్!

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nbk 111
Nbk 111

Nandamuri Balakrishna  టాలీవుడ్‌లో మాస్ క్రేజ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ విజయానంతరం దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి తెరకెక్కనున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మొదట చారిత్రక కథగా ప్లాన్ చేసినప్పటికీ, బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ కథను పూర్తిగా మార్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా ముంబయి నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. మార్చి తొలి వారం నుంచి షూటింగ్ ప్రారంభించనుండగా, బాలయ్య సింగిల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరో అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ . ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస యాక్షన్ సినిమాలతో దూసుకుపోతూ, థియేటర్లలో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. ఆయన పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు. వరుస విజయాలతో ఇటీవల కాలంలో బాలకృష్ణ ఇమేజ్ మరింత బలపడడంతో, ట్రేడ్ వర్గాల్లోనూ ఆయన సినిమాలపై భారీ నమ్మకం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరి కలయికలో గతంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ ‘ NBK 111 ’తో రూపొందించనున్నారు. తొలుత ఈ సినిమా కోసం ఒక చారిత్రక నేపథ్య కథను సిద్ధం చేసి ఫస్ట్‌ లుక్ కూడా విడుదల చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలయ్య చారిత్రక పాత్రల్లో ఒదిగిపోయే నటుడిగా మంచి పేరు సంపాదించడంతో, ఈ కాంబినేషన్‌లో పీరియాడికల్ సినిమా అంటే అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురుచూశారు.

అయితే ఆ కథ భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పీరియాడికల్ కథకు కావాల్సిన భారీ సెట్స్, విజువల్స్, గ్రాఫిక్స్ వల్ల బడ్జెట్ పరిమితులు ఎదురవడంతో, ఆ కథను పూర్తిగా పక్కన పెట్టి సరికొత్త కథను సిద్ధం చేశారట. దీంతో ఈ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారినట్లు తెలుస్తోంది. గత చిత్రాల మాదిరిగా డబుల్ రోల్స్ కాకుండా, ఈ సినిమాలో బాలకృష్ణ ఒకే పాత్రలో కనిపించనున్నారన్న సమాచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సినీ వర్గాల టాక్ ప్రకారం బాలయ్య ఇందులో మాఫియా డాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. కథ రెడీ కావడంతో మార్చి తొలి వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ కోసం స్టార్ దర్శకుల క్యూ కట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా తర్వాత మలయాళ సెన్సేషన్ దర్శకుడు హనీఫ్ అదేనీతో, అలాగే హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్ట్‌లు చర్చ దశలో ఉన్నట్లు సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, కొత్త కాంబినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం బాలయ్య ప్రస్తుత మార్కెట్ రేంజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nandamuri balakrishna
  • Budget Constraints
  • Gopichand Malineni
  • Hindupur MLA Nandamuri Balakrishna
  • nandamuri balakrishna
  • NBK 111 movie
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd