TTD Record : ఆన్ లైన్ సర్వదర్శనం టికెట్స్..15 నిమిషాల్లోనే అన్నీ ఖాళీ!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి.
- By Balu J Published Date - 12:10 PM, Mon - 27 December 21

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 10వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. కాగా, టికెట్లు విడుదలైన 15 నిమిషాల్లోనే మొత్తం పూర్తి కావటం విశేషం