Andhra Pradesh : విశాఖ 2వేల నోట్ల దందా కేసు.. పోలీస్ కస్టడీలో ఆర్ఎస్ఐ స్వర్ణలత
రెండువేల నోట్ల దందా కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.దందాలో కీలక నిందితురాలిగా ఉన్న ఆర్ఎస్ఐ స్వర్ణ లత
- Author : Prasad
Date : 14-07-2023 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
రెండువేల నోట్ల దందా కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.దందాలో కీలక నిందితురాలిగా ఉన్న ఆర్ఎస్ఐ స్వర్ణ లత నిన్నటి నుంచి పోలీసుల కస్టడీలో ఉన్నారు. నోట్ల మార్పిడి లో స్వర్ణ లత ప్రమేయం తో పాటు ఆమె కి సహకరించిన వ్యక్తుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె డ్రైవర్ హోంగార్డు శ్రీనివాస్, రిజర్వ్ కానిస్టేబుల్ మెహర్ లకు రౌడీ షీటర్లతో పరిచయాలు, వాళ్ళతో ఆమెకు పరిచయాలు, ఆమె నటిస్తున్న సినిమాలు? అంశాలపై పోలీసులు ఆరా తీసున్నారు. స్వర్ణలత విచారణకు సహకరించడంలేదని సమాచారం. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం పై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు తిరిగి స్వర్ణ లత తో పాటు ఇతర నిందితులను జుడిషియల్ రిమాండ్ కు పంపనున్నారు.