Rowdy Sheeter Killed: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రౌడీషీటర్ కాల్చివేత
కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలపై (Karnataka Elections) దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
- Author : Balu J
Date : 06-05-2023 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలపై (Karnataka Elections) దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రచారంలో రౌడీషీటర్‌పై (Rowdy sheeter) కాల్పులు (Gun Firing) జరిగాయి. మృతుడు హైదర్ అలీ నదాఫ్‌గా గుర్తించారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న నదాఫ్‌పై కాల్పులు జరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ప్రచారం చేస్తుండగా హంతకులు కారులో వచ్చి కాల్చి చంపి (Killed) అక్కడి నుంచి పారిపోయారు. నదాఫ్ భార్య నిషాత్ విజయపుర మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలుపొందారు. పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Also Read: Swapna Dutt&Priyanka Dutt: లెక్కలు వేసుకుంటే సినిమాలే చేయకూడదు: నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్