India vs Pakistan: జాతీయగీతం సందర్భంగా రోహిత్ శర్మ ఎక్స్ ప్రెషన్స్ వైరల్..!
భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే టీం ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తి కనబరుస్తారు.
- Author : Gopichand
Date : 23-10-2022 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే టీం ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఐసిసి టీ20 ప్రపంచ కప్ గ్రూప్- 2 పోరులో ఈ మ్యాచ్ ప్రభావం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంపై స్పష్టంగా కనిపించింది.
ఈ మ్యాచ్ కు ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కళ్లు మూసుకుని రోహిత్ ఉద్వేగభరితంగా మాట్లాడిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐసీసీ టోర్నీలో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్‌పై భారత అభిమానులు ఈ వీడియో చూసి కామెంట్స్ రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. టాస్ గెలిచిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ 7 బ్యాటర్లతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్-12 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. పాకిస్థాన్‌ను 159 పరుగులకే కట్టడి చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్‌శర్మ అంచనాలకు తగ్గట్టే భారత పేసర్లు సత్తా చాటారు. దింతో పాకిస్థాన్ జట్టు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం 12.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది.