Andhra Pradesh : పార్శిల్ లారీలో మొబైల్ ఫోన్ల చోరీ.. ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్
కడప జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోయారు. బ్లూ డార్ట్ కంపెనీకి చెందిన కంటైనర్ లారీ నుంచి భారీ మొత్తంలో మొబైల్..
- By Prasad Published Date - 09:59 PM, Tue - 8 November 22

కడప జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోయారు. బ్లూ డార్ట్ కంపెనీకి చెందిన కంటైనర్ లారీ నుంచి భారీ మొత్తంలో మొబైల్ ఫోన్ లను కుట్ర చేసి దొంగలించారు.ఈ ఘటనలో కడప జిల్లా పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 1కోటి 58లక్షల 14 వేల 789 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు, ల్యాబ్ ట్యాబ్ లు, రెండు కార్లు, బ్లూ టూత్ లు స్వాధీనం చేసుకున్నారు.