Road Accident : తిరుపతిలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
- By Vara Prasad Published Date - 04:14 PM, Sun - 19 June 22

తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌తోపాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను పోలీసులు, స్థానికుల సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం.
Related News

TTD Hundi : తిరుమల శ్రీవారికి ఒక్క రోజులో రూ.6.18 కోట్ల విరాళాలు
తిరుమల భక్తులు సోమవారం ఆలయ హుండీకి రూ.6.18 కోట్ల భారీ కానుకగా సమర్పించారు.