Road Accident : ఒంగోలు – శ్రీశైలం జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు
ప్రకాశం జిల్లాలో కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కొనకమిట్ల మండలం వెదురాళ్లపాడు గ్రామం వద్ద...
- By Prasad Published Date - 10:27 AM, Tue - 1 November 22

ప్రకాశం జిల్లాలో కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కొనకమిట్ల మండలం వెదురాళ్లపాడు గ్రామం వద్ద జరిగింది.భారీ వర్షం కురుస్తుండటంతో కారు రాయిని ఢీకొట్టి.. చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయలైయ్యాయి, గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. .ఈ కారు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.