Road Accident : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కడపలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి.
- Author : Prasad
Date : 09-10-2023 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
కడపలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. APSRTC బస్సును ఆటోని ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు . యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 11 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు మహ్మద్, షకీర్, హసీనా, అమీనాగా గుర్తించారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న యర్రగుంట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Chandrababu Quash Petition : సుప్రీం కోర్ట్ లో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది