Road Accident : మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
మేడ్చల్ ప్రధాన రహదారిపై లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది....
- Author : Prasad
Date : 29-09-2022 - 2:57 IST
Published By : Hashtagu Telugu Desk
మేడ్చల్ ప్రధాన రహదారిపై లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రధాన రహదారిలోని వివేకానంద విగ్రహం సమీపంలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా.. మహిళను లారీ ఢీకొట్టింది. దుర్మరణం చెందింది. ఆమె లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. మృతురాలిని ప్రియా మోరే (30)గా గుర్తించారు.
No Short cuts to Safety. Pls follow traffic Rules- Save your life#RoadSafety pic.twitter.com/N9VxVFiMw4
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 29, 2022