Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. స్కూటర్‌ని ఢీకోట్టిన డీసీఎం
హైదరాబాద్ బోవెన్‌పల్లి వద్ద డీసీఎం వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వైష్ణవి అనే
- By Prasad Published Date - 02:36 PM, Thu - 3 August 23

హైదరాబాద్ బోవెన్‌పల్లి వద్ద డీసీఎం వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వైష్ణవి అనే మహిళ తన తన తండ్రి విజయ్‌కుమార్‌తో కలిసి స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుండగా బోవెన్‌పల్లి రోడ్డు వద్ద డీసీఎం వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వైష్ణవి రోడ్డుపై పడిపోవడంతో డీసీఎం వాహనం ఆమెపైకి వెళ్లింది. ప్రమాదంలో వైష్ణవికి తీవ్ర గాయాలు కాగా, ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమె తండ్రి విజయ్‌కుమార్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై డీసీఎం డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.