Road Accident: నల్గొండలో కారు ఢీకొని ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
- Author : Praveen Aluthuru
Date : 25-02-2024 - 1:48 IST
Published By : Hashtagu Telugu Desk
Road Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను అత్యవసర వైద్య సహాయం కోసం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Alsos Read: Janasena : పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు..