Hyderabad: హైదరాబాద్ లో పెరుగుతున్న అద్దెలు, కారణమిదే
- By Balu J Published Date - 11:27 PM, Tue - 25 June 24

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు…నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్‌తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి.
ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే పది నుంచి పదిహేను శాతం పైగా పెరిగాయి. గతంలో 10, 15 వేలకు నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి కానీ ఇప్పుడు 20 నుంచి 25 వేల పైగా ఖర్చు చేస్తే దొరకని పరిస్థితి. హైదరాబాద్ లో చాలామంది బ్యాచిలర్లు రెంట్లు కట్టలేక హైదరాబాద్ శివారులో ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.