Rinku Singh Engaged: ఎంపీతో టీమిండియా క్రికెటర్ వివాహం.. ఫొటోలు వైరల్!
ఆల్ రౌండర్ రింకూ సింగ్ ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలో జరగనుంది.
- By Gopichand Published Date - 05:43 PM, Fri - 17 January 25

Rinku Singh Engaged: యూపీలోని మచ్లీ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ప్రియా సరోజ్‌తో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం (Rinku Singh Engaged) జరిగింది. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు రోజుల క్రితం ప్రియా సరోజ్‌తో రింకూ నిశ్చితార్థం జరిగింది. రింకూ సోదరి నేహా సింగ్ ఎంగేజ్‌మెంట్ ఫోటోను శుక్రవారం పోస్ట్ చేసింది. రింకూ కాబోయే భార్య ప్రియా సరోజ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. 25 ఏళ్లకే ఎంపీ అయ్యారు.
ప్రియా సరోజ్ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రియా సరోజ్ బీజేపీ సీనియర్ నాయకురాలు. ఎంపీ ఎన్నికల్లో బీపీ సరోజ్‌పై విజయం సాధించారు. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. 1999, 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
Also Read: Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ
ఆల్ రౌండర్ రింకూ సింగ్ ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలో జరగనుంది. రింకు టీ20 ఇంటర్నేషనల్‌లో మూడు అర్ధశతకాలు సాధించాడు. రింకు సింగ్ 18 ఆగస్టు 2023న డబ్లిన్‌లో టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 3 అర్ధశతకాలు పూర్తి చేసుకున్నాడు. రింకూ 30 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 46.09 సగటుతో 507 పరుగులు చేశాడు. అతను 2 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు.
BCCI కఠినమైన నియమాలు
టీం ఇండియా క్రికెటర్లు ఇకపై దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. సిరీస్ సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబంతో కలిసి ప్రకటనలు చేయలేరు లేదా ప్రయాణం చేయలేరు. ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లకు హాజరు కావడం ఇప్పుడు తప్పనిసరి చేశారు.
ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్
- తొలి టీ20 జనవరి 22న కోల్‌కతాలో జరగనుంది.
- రెండో టీ20 జనవరి 25న చెన్నైలో జరగనుంది.
- మూడో టీ20 జనవరి 28న రాజ్‌కోట్‌లో జరగనుంది.
- నాలుగో టీ20 జనవరి 31న పూణేలో జరగనుంది.
- ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది.
ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే సిరీస్
- తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరగనుంది.
- ఫిబ్రవరి 9న రెండో వన్డే కటక్‌లో జరగనుంది.
- మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.