Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం..!
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
- By Gopichand Published Date - 05:19 PM, Wed - 6 December 23

Revanth Reddy: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. “తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైనది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే రేపు నగరానికి రానున్నారు.
Also Read: Manickam Tagore: తెలంగాణను రేవంత్ అభివృద్ధి పథంలో నడిపిస్తారు: మాణికం ఠాగూర్
We’re now on WhatsApp. Click to Join.