Manickam Tagore: తెలంగాణను రేవంత్ అభివృద్ధి పథంలో నడిపిస్తారు: మాణికం ఠాగూర్
- By Balu J Published Date - 04:51 PM, Wed - 6 December 23

Manickam Tagore: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత, తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ నేతలను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ను రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
రేపు హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక రోజుకు నన్ను ఆహ్వానించడానికి ఆయన వచ్చారు. తెలంగాణా కాంగ్రెస్‌ని కొత్త శిఖరాలకు ఎక్కించినట్లే, తెలంగాణా రాష్ట్రాన్ని కూడా ఆయన ముందుకు నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్, చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాణికం ఠాగూర్ ను రేవంత్ ఆహ్వానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడం ఒక సోదరుడిగా తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక కార్యక్రమానికి తనను ఆహ్వానించేందుకు రేవంత్ వచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న నమ్మకం ఉందన్నారు.