Rajnath Singh: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Author : Praveen Aluthuru
Date : 11-08-2024 - 1:13 IST
Published By : Hashtagu Telugu Desk
Rajnath Singh: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో “అనంతనాగ్‌లోని కోకెర్‌నాగ్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భారత ఆర్మీ సైనికులు మరణించినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖ సమయంలో దేశం వీర సైనికుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులలో హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్ మరియు లాన్స్ ప్రవీణ్ శర్మ ఉన్నారు. చనిపోయిన సహచర సైనికులకు ఇండియన్ ఆర్మీ సంతాపంక్తం చేసింది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శనివారం అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాల మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అహ్లాన్‌లో ఇరువురి మధ్య గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు సహా ఐదుగురు గాయపడ్డారు.
Also Read: Vivo Smart Phones: వివో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే!