Raghurama & Pawan: పవన్ కు రఘురామరాజు థ్యాంక్స్!
తనపై సీఐడీ దాడిని ఖండించినందుకు పవన్ కల్యాణ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు ధన్యవాదాలు తెలిపారు.
- By Balu J Published Date - 06:25 PM, Mon - 18 July 22

తనపై సీఐడీ దాడిని ఖండించినందుకు, మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చిన నేపథ్యంలో, అదే కార్యక్రమానికి ఎంపీ రఘురామరాజును రాకుండా అడ్డుకున్నట్లు అనేక ఆరోపణలొచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా అడ్డుకున్నట్టు జనసైనికులు ఆరోపించారు కూడా. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రఘురామరాజు రియాక్ట్ అయ్యారు. “ పవన్.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీలాంటి ధైర్యవంతులైన నాయకులు మాత్రమే ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దాటవేయగలరు’’ అని అన్నారు. తాను రాకపోవడానికి గల కారణాన్ని వివరించాడు పవన్.
స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడంతో ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం సరికాదని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రఘురామ కాళ్లపై చాలా దారుణంగా కొట్టారని, ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎంపీ తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేకపోయారని పవన్ జగన్ తీరుపై మండిపడ్డారు. “ఇది ఒక్క రఘురామపై జరిగిన దాడి కాదు. అయితే క్షత్రియ నాయకులందరిపై వైఎస్సార్‌సీపీ దాడి చేసింది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సిఐడి పోలీసులు నా పై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు మీకు నా ధన్యవాదాలు @PawanKalyan గారు. pic.twitter.com/LYFpl5k7Uu
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 17, 2022