HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Public Appeals Should Be Addressed Promptly Deputy Mayor

Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన స‌మ‌స్య‌ల‌ను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్

ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌తో పాటుగా అడిషనల్ కమిషనర్లు ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు.

  • Author : Gopi Date : 18-11-2024 - 5:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy Mayor
Deputy Mayor

Deputy Mayor: ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన విన్నపాలు వెంటనే పరిష్కారం చేయాలని డిప్యూటీ మేయర్ (Deputy Mayor) శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ విన్నపాలను డిప్యూటీ మేయర్ స్వీకరించి సమస్యల‌ను పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాల‌ని, అర్జీదారుని సమస్యను పరిష్కారం చేయటంలో అలసత్వం చేయ‌వ‌ద్ద‌ని అధికారులను ఆదేశించారు. అర్జీదారునికి నిర్దేశించిన కాల వ్యవధిలో పరిష్కారం చేయాలన్నారు.

ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌తో పాటుగా అడిషనల్ కమిషనర్లు ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, రఘు ప్రసాద్, సుభద్ర దేవి, యాదగిరి రావు, సామ్రాట్ అశోక్, సత్యనారాయణ, వెణు గోపాల్ రెడ్డి, అడిషనల్ సీసీపీలు గంగాధర్, ప్రదీప్‌లు విన్నపాలను స్వీకరించారు.

Also Read: Minister Ponnam: మ‌హారాష్ట్ర‌లో త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టిన మంత్రి పొన్నం

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 117 విన్నపాలు వచ్చాయి. అందులో హెడ్ ఆఫీస్ లో 46 విన్నపాలలో టౌన్ ప్లానింగ్ 26, ఇంజనీరింగ్ 05, ట్యాక్స్ 09, యుబీడీ, శానిటేషన్, ఫైనాన్స్‌, హౌసింగ్ సంబంధించినవి ఒక్కొక్కటీ రాగా హెల్త్ 2 విన్నపాలు వచ్చాయి. కూకట్ పల్లి జోన్ లో 38, శేరిలింగంపల్లి 7, ఖైరతాబాద్ 2, ఎల్బీ నగర్ 07, చార్మినార్ 02, సికింద్రాబాద్‌ 15 విన్నపాలు వచ్చాయి. ఈ ప్రజావాణిలో హౌసింగ్ ఎస్ఈలు కృష్ణారావు, పీవీ రావు, రాజేశ్వర్ రావు, డిప్యూటీ సీఈ పనస రెడ్డి, వాటర్ వర్క్స్ జీఏం సాయి రమణ, సీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకిల్, ఎస్టేట్ అధికారి శ్రీనివాసరెడ్డి, జాయింట్ కమిషనర్ మహేష్ కులకర్ణి, ఓఎస్‌డీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy Mayor
  • Deputy Mayor Srilatha Sobhan Reddy
  • GHMC
  • GHMC News
  • Greater Hyderabad
  • Public Issues
  • telangana
  • telangana news
  • telugu news

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd