HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Prices Of Essential Commodities Like Salt Pappu Have Increased Under Modi Regime Kalvakuntla Kavitha

MLC Kavitha: మోడీ పాలనలో ఉప్పు, పప్పు, లాంటి నిత్యవసర ధరలు పెరిగాయి: కల్వకుంట్ల కవిత

  • By Balu J Published Date - 11:47 AM, Mon - 20 November 23
  • daily-hunt
Modi new slogan
Kavitha Knots Infront Of Modi

MLC Kavitha:  తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని, ఇతర పార్టీలది అధికార బంధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని, కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ను తిరస్కరించి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత గారు ధర్మపురిలో మహిళా సమావేశంతో పాటు గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఎన్నికలు ఉన్నాయని ఇతర పార్టీల వాళ్లు అది ఇస్తాము అది ఇస్తామని వచ్చి మాటలు చెప్పి పోతారని, కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశమిస్తే పెన్షన్ రూ. 200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది పెట్టే గుణం కాదని, అధికారకాంక్ష మాత్రమే ఉంటుందని మండిపడ్డారు. తమది పేగు బంధం అయితే కాంగ్రెస్ వాళ్లది అధికారం కోసం అహంకారమని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కొసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన నాడు హైదరాబాద్ మినహా అప్పటి 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉండేవని తెలిపారు. ఉమ్మడి పాలనలో కరెంటు ఉండేది కాదని, నీళ్లు లేవని, రైతులకు ఒక్క పైసా ఇచ్చిన వాళ్లు లేరని గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ పచ్చబడిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పింది చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరో సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు రూ. 5 వేలకు పెరుగుతుందని, ఎన్నికలు పూర్తయిన వెంటనే రూ. 3 వేలకు పెరుగుతుందని, ఆ తర్వాత ఏటేటా పెరుగుతూ ఐదేళ్లకు రూ. 5 వేలకు చేరుతుందని వివరించారు. కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దాంతో కోటి కార్డులకు చేరుతాయన్నారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ రక్ష పేరిట రూ. 5 లక్షల బీమా సౌకర్యం కలిగిస్తామని, సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 15 లక్షల వరకు ఉచితంగా చికిత్స చేయించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రైతు బంధు మొత్తం పెంపు గురించి ప్రస్తావించారు. అగ్రవర్ణ పేదల కోసం గురుకుల హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో కరెంటు ఉండకపోయేదని, ఇప్పుడు 24 గంటల పాటు కరెంట్ ఉంటోందని అన్నారు. పోలింగ్ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్లే ముందు లైట్ వేయాలని, ఒకవేళ బుగ్గ వెలిగితే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని అన్నారు. గతంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్త అయిన పరిస్థతికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఉప్పు, పప్పు, మంచినూనె వంటి నిత్యవసర ధరలన్నీ పెరిగాయని, గ్యాస్ సిలిండర్ పేదల పాలిట గుదిబండగా మారిందని విమర్శించారు. రూ. 1200గా ఉన్న సిలిండర్ ధరను సబ్సిడీ కింద రూ. 400కే ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రూ. 2 వేల పెన్షన్ ఇస్తే అందులో సిలిండర్ పేరిట ప్రధాని మోడీ రూ. 1200 తీసుకుంటున్నారని, అందుకోసం ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సిలిండర్ ధరను తగ్గించి పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నారని వివరించారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అంటే పైసలు ఇచ్చేటివి పెంచుడూ, సిలిండర్ ధర తగ్గించుడు అని పేర్కొన్నారు.

తెలంగాణ రాకముందు ధర్మపురి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేదని, ఇప్పుడు లక్షా 30 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వివరించారు. ఎస్ఆర్ఎస్పీ లింక్ వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నమని,ఆ కాలువల వల్ల చెరువులు నింపుకోవడం వల్ల ఊర్లు బాగున్నాయని అన్నారు. మొత్తం ధర్మపురి నియోజకవర్గంలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సౌమ్యుడైన ఈశ్వర్ సీఎం కేసీఆర్ తో నిరంతరం చర్చిస్తూ ధర్మపురికి కావాల్సిన పని చేస్తారని అన్నారు. నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఒక్క సారి ఓటేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఏడుస్తున్నారని, కానీ కాంగ్రెస్ కు ఓటేస్తే ఐదేళ్లు మనం ఏడవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని, విషం చిమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Govt
  • Dharmapuri
  • MLC Kavitha
  • pm modi

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd