President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన ఖరారైంది.ఈ రోజు మరియు రేపు ఆమె అక్కడే పర్యటిస్తారు. రాష్ట్రపతి డిసెంబర్ 11 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు
- Author : Praveen Aluthuru
Date : 11-12-2023 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
President Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన ఖరారైంది.ఈ రోజు మరియు రేపు ఆమె అక్కడే పర్యటిస్తారు. రాష్ట్రపతి డిసెంబర్ 11 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు .డిసెంబర్ 11న వారణాసిలో జరగనున్న మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 45వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు . అదే సాయంత్రం ఆమె లక్నోలో డివైన్ హార్ట్ ఫౌండేషన్ 27 సంవత్సరాల వేడుకల్లో పాల్గొంటారు.డిసెంబర్ 12న, లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
Also Read: Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!