Biden: భారత్ మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం!
ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
- By Balu J Published Date - 05:05 PM, Tue - 12 April 22

ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. రష్యా యుద్ధంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే అంశంపై భారత్, అమెరికాలు పరస్పరం సంప్రదించుకుంటాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతోందని కూడా తెలిపారు. కాగా మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం భారత్‌కు ప్రయోజనకరం కాదని మోదీకి బైడెన్ సూచించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. మరిన్ని మార్గాల నుంచి ఇంధన దిగుమతులు సాగించేలా చేయూతనందిస్తామని పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని ఈ సందర్భంగా వైట్‌హౌస్ వెల్లడించింది.
♦ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నాం:అమెరికా అధ్యక్షుడు బైడెన్
♦రష్యా యుద్ధంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే అంశంపై భారత్,అమెరికాలు పరస్పరం సంప్రదించుకుంటాయని పేర్కొన్నారు.
♦రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతోందని కూడా తెలిపారు. pic.twitter.com/MrGotolVOa— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 12, 2022