Pregnant Women : ఏజెన్సీలో గర్భిణీల దీనస్థితి.. ఆసుప్రతికి వెళ్లాలంటే డోలీలోనే..!
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్ర
- Author : Prasad
Date : 10-12-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆసుపత్రికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే దిక్కవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఘటనలో పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ముల్లోవకు చెందిన పార్వతమ్మకు ప్రసవ నొప్పి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను ‘డోలీ’పై మూడు కిలోమీటర్లు వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఈ మండల గిరిజనులు దశాబ్దాలుగా ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులు, అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, రహదారి నిర్మాణంపై హామీ ఇస్తున్నారు కాని ఏమీ చేయడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గిరిజన మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. కనెక్టివిటీ లేకపోవడం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. పక్కా రోడ్డు నిర్మించాలని కోరుతూ పలుమార్లు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఎన్నిసార్లు అధికారులకు, రాజకీయ నాయకులు తమ బాధలు చెప్పుకున్నప్పటికి సమస్యలు తీర్చడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gutka Ad Case : గుట్కా యాడ్స్.. షారుక్, అక్షయ్, అజయ్‌లకు కేంద్రం నోటీసులు