Gutka Ad Case : గుట్కా యాడ్స్.. షారుక్, అక్షయ్, అజయ్‌లకు కేంద్రం నోటీసులు
Gutka Ad Case : గుట్కాలకు సంబంధించిన యాడ్స్‌లో యాక్ట్ చేసినందుకు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- By Pasha Published Date - 05:56 PM, Sun - 10 December 23

Gutka Ad Case : గుట్కాలకు సంబంధించిన యాడ్స్‌లో యాక్ట్ చేసినందుకు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు గుట్కా తరహా హానికారక ఉత్పత్తుల యాడ్స్‌లో(Gutka Ad Case) నటించడం సరికాదంటూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని అప్పట్లో విచారించిన కోర్టు.. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మోతీలాల్ యాదవ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు సమాధానం ఇస్తూ.. కోర్టులో దాఖలైన పిటిషన్‌కు స్పందనగా షారుక్, అక్షయ్, అజయ్‌లకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ తరహా యాడ్స్ నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పాండే తెలియజేశారు.ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, దీన్ని కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.