Pregnant Died: మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌తో గర్భిణి మృతి
స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయే సంఘటనలు మనం చాలానే చూశాం. ఇప్పుడు బ్రెజిల్ లో ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.
- By Balu J Published Date - 01:46 PM, Sat - 26 August 23
Pregnant Died: స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయే సంఘటనలు మనం చాలానే చూశాం. ఇప్పుడు బ్రెజిల్ లో ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌తో గర్భిణి మృతి చెందింది. స్థానిక మీడియా ప్రకారం ఆ యువతి పేరు జెన్నిఫర్ కరోలిన్. ఆమె అప్పుడే బాత్రూమ్ నుండి బయటకు వచ్చి, తడి చేతులతో తన ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకుంది.
ఫోన్‌కి ఛార్జింగ్ పెడుతుండగా, అది ఒక్కసారిగా ఎగసిపడి జెన్నిఫర్‌కు విద్యుదాఘాతం తగిలింది. విద్యుదాఘాతానికి గురై జెన్నిఫర్ కేకలు వేసింది. ఆమె గొంతు విని భర్త పరుగున లోపలికి వచ్చాడు. ఈ సమయంలో జెన్నిఫర్ నేలపై పడి ఉంది. ఆమె భర్త వెంటనే వైద్య సహాయం కోరాడు. అయితే జెన్నిఫర్ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది వివరించారు.
Also Read: Pooja Hegde: తగ్గని పూజాహెగ్డే క్రేజ్.. షాపు ఓపెనింగ్ కు ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!