Prabhas: సినిమా టికెట్ల ధరల జీవోపై స్పందించిన ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.
- By Hashtag U Published Date - 04:07 PM, Mon - 7 March 22

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. జగన్ సర్కార్ సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే సంతోషిస్తానని తెలిపారు. అయితే, ‘రాధేశ్యామ్’ చిత్ర విడుదలకు ముందే ఈ జీవో వస్తే ఇంకా చాలా సంతోషకరమని డార్లింగ్ ప్రభాస్ పేర్కొన్నారు .
కాగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, మూవీ టికెట్ ధరల అంశంపై సీఎం జగన్‌తో ఇటీవల సినీ ప్రముఖలు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు.. త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని సినీ ప్రముఖలు తెలిపారు.