Drugs : పంజాబ్‌లో 2 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
పంజాబ్‌లో రెండు కేజీల హెరాయిన్‌ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి అక్రమంగా...
- By Prasad Published Date - 08:58 AM, Mon - 28 November 22

పంజాబ్‌లో రెండు కేజీల హెరాయిన్‌ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌తో పాటు లైసెన్స్ లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2 కేజీల హెరాయిన్, ఎనిమిది లైసెన్స్ లేని పిస్టల్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మాజీ జైలు సహచరుడి సహాయంతో పాకిస్తాన్ నుండి సరుకును సరఫరా చేసినట్లు అరెస్టయిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు.