Kashmir: గుప్కార్ నేతల హౌస్ అరెస్ట్
- By hashtagu Published Date - 03:02 PM, Sat - 1 January 22
పునర్విభజన కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా గుప్కార్ నేతలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని జమ్ముకశ్మీర్ పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామిలతో పాటు ఇతర నేతలందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు.
అయితే తమ శాంతియుత నిరసనలను అణచివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. కొత్త ఏడాదిలో జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రజలను అక్రమంగా ఇళ్లలో బంధిస్తున్నారని.. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఒమర్ అభ్దుల్లా అన్నారు. మా నిరసనలను అడ్డుకునేందుకు ఇంటి బయట ఉండే గేట్ ముందు పెద్ద ట్రక్కులు నిలిపారని.. ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్యానికి ఈ ఘటన ఓ గొడ్డలి పెట్టులాంటిదని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Good morning & welcome to 2022. A new year with the same J&K police illegally locking people in their homes & an administration so terrified of normal democratic activity. Trucks parked outside our gates to scuttle the peaceful @JKPAGD sit-in protest. Some things never change. pic.twitter.com/OeSNwAOVkp
— Omar Abdullah (@OmarAbdullah) January 1, 2022
జమ్ములో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలను, కశ్మీర్‌లో కేవలం ఒక సీటును మాత్రమే ఏర్పాటు చేయాలని పునర్విభజన కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా గుప్కార్ సభ్యులు నిరసనలకు పిలుపునిచ్చారు. కమిషన్ పక్షపాతంతో, రాజ్యాంగ విరుద్ధంగా చేసిన సిఫార్సులు ఉన్నాయని కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు.. కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాయి.