PM Modi Telangana Tour : ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
- Author : Prasad
Date : 26-06-2022 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు.రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు. జులై 1న మధ్యాహ్నం 3గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు