PM Modi Covid Review: నేడు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్.. కోవిడ్ తాజా పరిస్థితులపై చర్చ
నేడు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
- Author : Hashtag U
Date : 27-04-2022 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని కోవిడ్ సంబంధిత పరిస్థితులపై సిఎంలతో పిఎం మోడీ సంభాషిస్తారని పీఎంవో కార్యాలయ అధికారి తెలిపారు.
అనేక పండుగలు రానున్నందున కరోనావైరస్ నుండి వచ్చే ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్-తగిన ప్రవర్తనను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రజలను కోరారు. మన్ కీ బాత్ రేడియో ప్రసారంలో.. రాబోయే రోజుల్లో ఈద్ పండుగ, అక్షయ తృతీయ, భగవాన్ పరశురాముడి జయంతి, వైశాఖ బుధ్ పూర్ణిమ జరుపుకోనున్నట్లు చెప్పారు. ఈ పండుగలన్నీ సంయమనం, స్వచ్ఛత, దాతృత్వం, సామరస్యానికి సంబంధించిన పండుగలని.. . ఈ పండుగల సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలను ఎంతో ఆనందంగా, సామరస్యంతో జరుపుకోవాలని ప్రజలను ప్రధాని మోడీ కోరారు.