Narendra Modi : సైప్రస్‌లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి
Narendra Modi : ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ అద్భుతమైన భారతీయ పరంపరలతో కూడిన స్వాగతం లభించింది.
- By Kavya Krishna Published Date - 08:20 PM, Mon - 16 June 25

Narendra Modi : ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ అద్భుతమైన భారతీయ పరంపరలతో కూడిన స్వాగతం లభించింది. నికోసియాలో జూన్ 15న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైప్రస్ రాజధాని నికోసియా నగర కౌన్సిల్ సభ్యురాలు మైకేలా కిథ్రియోటి మ్లాపా, చారిత్రక నగర కేంద్రంలో మోదీకి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఆ సందర్భంలో ప్రధాని పాదాలకు ఆమె నమస్కరించగా, ఈ అభినందనకు ప్రధాని మోదీ ఆనందంగా స్పందించి ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు.
ఈ హృద్య దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. విదేశీయురాలే భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడం చూసి పలువురు నెటిజన్లు ఆకర్షితులయ్యారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, దేశం పెంచుకుంటున్న గ్లోబల్ గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ, “ఇది హృదయాన్ని తాకే ఘట్టం. వినయం, గౌరవం వంటి భారతీయ శాశ్వత విలువలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ప్రధాని మోదీకి విదేశాల్లోనూ లభిస్తున్న గౌరవం మన సాంస్కృతిక మౌల్యాల ప్రాధాన్యతను చెబుతోంది” అని అన్నారు. ఈ సంఘటన మైకేలా వంటి విదేశీయులు భారతీయ సంస్కృతిని ఎంత గౌరవంగా చూస్తున్నారో, భారతదేశం ప్రపంజ వ్యాప్తంగా కలిగిస్తున్న మానవీయ , సాంస్కృతిక ప్రభావాన్ని రుజువు చేస్తోంది.
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
In a deeply moving moment in the historic centre of Nicosia, Council Member Michaela Kythreoti Mhlapa bowed to touch the feet of Hon’ble PM Shri @narendramodi ji — a gesture of profound respect. 🇮🇳🇨🇾
This heartfelt exchange reflects how India’s timeless values of humility and… pic.twitter.com/fd5q7veDp6
— Pralhad Joshi (@JoshiPralhad) June 16, 2025