Modi arrives PMO: ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ
నిన్న ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరి చూపు శాఖల విభజనపైనే ఉంది.
- By Praveen Aluthuru Published Date - 12:26 PM, Mon - 10 June 24
Modi arrives PMO: నిన్న ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరి చూపు శాఖల విభజనపైనే ఉంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మధ్యాహ్నం తొలి కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో చేశారు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి మరియు దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి తన మంత్రి మండలితో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మేము ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోబోమని ఆయన చెప్పారు. కాగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు.
Also Read: Viral : చంద్రబాబు మంత్రివర్గం ఇదేనా..?