Piyush Chawla: ముంబైకి పెద్ద దిక్కుగా పీయూష్ చావ్లా
IPL 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్‌లు జట్టుకు దూరం కావడంతో ముంబై బౌలింగ్ లైనప్ వీక్ అనుకున్నారు అందరూ.
- By Praveen Aluthuru Published Date - 10:59 PM, Tue - 16 May 23

Piyush Chawla: IPL 2023లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్‌లు జట్టుకు దూరం కావడంతో ముంబై బౌలింగ్ లైనప్ వీక్ అనుకున్నారు అందరూ. కానీ ముంబై తరుపున పీయూష్ చావ్లా అదరగొడుతున్నాడు. బుమ్రా, ఆర్చర్ లేని లోటుని చావ్లా తీరుస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో 34 ఏళ్ల పీయూష్ ముంబై తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పీయూష్ కృషియల్ వికెట్ పడగొట్టాడు. లక్నో స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్ క్రీజులో నిలదొక్కుకుంటున్న తరుణంలో 16 పరుగుల వద్ద పీయూష్ అతన్ని పెవిలియన్ పంపించేశాడు. గత మ్యాచ్‌లోనూ పియూష్ తొలి బంతికే విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
‘
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున పీయూష్ చావ్లా అత్యంత విజయవంతమైన బౌలర్ గా రాణిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో పీయూష్ ఇప్పటివరకు 20 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో మిగతా ముంబై బౌలర్లు కలిసి మొత్తం 19 వికెట్లు తీశారు. అంటే ముంబైని ప్లేఆఫ్ రేసులో నిలబెట్టడంలో పీయూష్ చావ్లాదే పైచేయి.
ఈ ఐపీఎల్ సీజన్లో చావ్లా రికార్డుల పర్వం కొనసాగుతుంది. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పీయూష్ మూడో స్థానంలో ఉన్నాడు. 177 ఐపీఎల్ కెరీర్‌లో పీయూష్ 176 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, పీయూష్ యొక్క ఎకానమీ కూడా 7.86 మాత్రమే ఉంది, అయితే అతను ఈ లీగ్‌లో రెండుసార్లు నాలుగు వికెట్లు తీసిన ఘనతను సాధించాడు.
Read More: LSG vs MI: గాయం కారణంగా కృనాల్ అవుట్.. కష్టాల్లో లక్నో