LSG vs MI: గాయం కారణంగా కృనాల్ అవుట్.. కష్టాల్లో లక్నో
ఐపీఎల్ 63 మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఓపెనర్లు ఫెయిల్ అవ్వడంతో లక్నో కష్టాల్లో పడింది.
- Author : Praveen Aluthuru
Date : 16-05-2023 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
LSG vs MI: ఐపీఎల్ 63 మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఓపెనర్లు ఫెయిల్ అవ్వడంతో లక్నో కష్టాల్లో పడింది. దీంతో జట్టును కాపాడే ప్రయత్నంలో కెప్టెన్ కృనాల్ పాండ్య చెమటోడ్చాడు. స్టోయినిస్‌తో తో మంచి భాస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే సమయంలో కృనాల్ గాయం కారణంగా పెవిలియన్ బాట పట్టాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం లభించకపోవడంతో ఓపెనర్లిద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. మూడో ఓవర్‌లో తొలి బంతికే దీపక్ హుడా క్యాచ్ ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు. రెండో బంతికే ప్రేరక్ మన్కడ్ అవుటయ్యాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. అదే సమయంలో ఏడో ఓవర్లో క్వింటన్ డికాక్ ఔటయ్యాడు. దీంతో లక్నో పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడింది. అయితే నాలుగో వికెట్‌కు కెప్టెన్ కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదే సమయంలో లక్నోకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కృనాల్ 49 పరుగుల వద్ద గాయం కారణంగా మైదానం నుండి వెళ్లిపోయాడు. కృనాల్ పాండ్యా అజేయంగా 49 పరుగులు చేసిన తర్వాత గాయపడ్డాడు. 16 ఓవర్లు ముగిసిన తర్వాత కృనాల్ మైదానం నుండి బయటకు వెళ్ళవలసి వచ్చింది. కృనాల్ 42 బంతుల్లో 49 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్ ,సిక్సర్ కొట్టాడు.
Krunal Pandya retired hurt after scoring 49 runs off 42 balls against Mumbai.
📷: Twitter#KrunalPandya #Lucknow #Mumbai #IndianT20League #ITL2023 #BetHive pic.twitter.com/J9WwWt8l79
— BetHive (@bethiveonline) May 16, 2023
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేవలం 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీని తర్వాత, కెప్టెన్ కృనాల్, మార్కస్ స్టోయినిస్‌తో కలిసి నాల్గో వికెట్‌కు ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్టోయినిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో అర్ధ సెంచరీ సాధించాడు.
ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో లక్నో సూపర్ జెయింట్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లక్నో 12 మ్యాచ్‌లు ఆడి అందులో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. లక్నో తమ చివరి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
Read More: LSG vs MI: దీపక్ హుడా ఫెయిల్యూర్ సీజన్