Petrol Diesel: ఏపీ, తెలంగాణలలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
- By Gopichand Published Date - 07:53 AM, Sun - 29 October 23
Petrol Diesel: పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌ను పరిశీలిస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 2 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం 22 మే 2022 న జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలను మార్చారు.
ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97.82 కాగా విజయవాడలో పెట్రోల్ రూ. 111.88, లీటర్ డీజిల్ రూ. 99.62గా ఉంది.
Also Read: Gold- Silver: భారీగా పెరిగిన ధరలు.. దేశ వ్యాప్తంగా రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.
We’re now on WhatsApp : Click to Join
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.
Tags
Related News
ATM Fraud: ఏటీఎం కార్డ్ ట్రాప్ స్కామ్ అంటే ఏమిటి? సైబర్ మోసగాళ్ల కొత్త రూట్ ఇదే..!
ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుండగా మరోవైపు భద్రతా ఉల్లంఘన ప్రమాదం కూడా ఉంది.