Petrol Diesel Price: పెట్రో మోత…9వ రోజు పెరిగిన ధరలు..!
- Author : hashtagu
Date : 31-03-2022 - 9:17 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07 కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్ లో లీటర్ పెట్రోల్ రూ.117.32, డీజిల్ రూ.103.10 కి చేరింది. తెలంగాణ విషయానికొస్తే… హైదరాబాద్ లో పెరిగిన ధరల అనంతరం లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది. మొత్తంగా చూస్తే… గడిచిన 10రోజుల వ్యవధిలో 9 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.