Fuel Rates: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?
ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం కొత్త పెట్రోల్, డీజిల్ రేట్ల (Fuel Rates)ను విడుదల చేశాయి.
- By Gopichand Published Date - 07:28 AM, Sun - 3 September 23
Fuel Rates: ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం కొత్త పెట్రోల్, డీజిల్ రేట్ల (Fuel Rates)ను విడుదల చేశాయి. దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగా, యూపీలోని కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ చౌకగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో వారం చివరి రోజున ముడి చమురు మంచి పెరుగుదలతో ముగిసింది. WTI క్రూడ్ ఆయిల్ ధర 2.30 శాతం పెరిగి బ్యారెల్‌కు 85.55 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.98 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
నాలుగు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే..?
మరోవైపు ఆదివారం ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని అన్ని నగరాల్లో పెట్రోల్- డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. చెన్నైలో పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు.
Also Read: Best Juices: మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ జ్యూస్ ట్రై చేయండి..!
ఇతర నగరాల్లో ధరలు..?
ఆగ్రాలో పెట్రోల్ రూ. 96.77కు, డీజిల్ రూ. 89.93కి విక్రయిస్తున్నారు.
అహ్మదాబాద్ లో పెట్రోల్ రూ. 96.51, డీజిల్ రూ. 92.25 చొప్పున విక్రయిస్తున్నారు.
అజ్మీర్ లో పెట్రోల్ రూ. 108.44, డీజిల్ రూ. 93.69 చొప్పున విక్రయిస్తున్నారు.
జైపూర్ లో పెట్రోల్ రూ. 108.22, డీజిల్ రూ. 93.48కి చొప్పున విక్రయిస్తున్నారు.
గురుగ్రామ్ లో పెట్రోల్ రూ. 97.04, డీజిల్ రూ. 89.91కి విక్రయిస్తున్నారు.
లక్నోలో పెట్రోల్ రూ. 96.36కు, డీజిల్ రూ. 89.56కు విక్రయిస్తున్నారు.
పాట్నాలో పెట్రోల్ రూ. 107.74, డీజిల్ రూ. 94.51కి విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109.66, డీజిల్ రూ. 97.82కి విక్రయిస్తున్నారు.
నగరాల వారీగా కొత్త ధరను తనిఖీ చేయండిలా
మీరు మీ రాష్ట్రం, నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయాలనుకుంటే మీరు MSM ద్వారా తనిఖీ చేయవచ్చు. HPCL కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపండి. అయితే ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP <డీలర్ కోడ్> అని వ్రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. కొత్త ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. దీని తర్వాత కొన్ని నిమిషాల్లో మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధర గురించి సమాచారాన్ని పొందుతారు.
Related News
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ రెండు బ్యాంకులే బెస్ట్..!
మన భవిష్యత్తుని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడానికి మనమందరం వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాము.