Pension : త్వరలోనే దివ్వాంగుల పెన్షన్లు పెంపు: మంత్రి సీతక్క
అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కాలమైన కూడా దానిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఈ మేరకు సీతక్క త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు.
- By Latha Suma Published Date - 12:34 PM, Thu - 28 November 24

Minister Sitakka : మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్కదివ్యాంగుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..త్వరలోనే దివ్యాంగులకు పెంచుతామని ఆమె ప్రకటించారు. ఎన్నికల హామీలో మూడువేల దివ్యాంగుల పెన్షన్ను 6000 కు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కాలమైన కూడా దానిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఈ మేరకు సీతక్క త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు. అయితే ఎప్పుడు పెంచుతాం అనే డేట్ మాత్రం ఖరారు చేయలేదు. అలాగే బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివ్యాంగుల క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కాగా, పెన్షన్ పెంపు అనేది ఒక్క దివ్యాంగులకు మాత్రమే ఉండదు. పెంచితే.. అన్ని రకాల పింఛను దారులకూ పెంపు ఉంటుంది. ఆ రకంగా చూస్తే వృద్ధులు, బీడీ కార్మికులు ఇలా అందరికీ పెంపు వర్తిస్తుంది. అందువల్ల పెన్షన్ పెంపు అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. పెంపు ఎప్పుడో మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలో అన్నారు. డిసెంబర్‌లో పెంపు ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే.. మిగిలిన రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఇచ్చేందుకే డబ్బు లేదు. అలాంటప్పుడు పెన్షన్ పెంపు డిసెంబర్‌లో ఉండటం కష్టమే. మరి జనవరి నుంచి ఇస్తారా అనేది చూడాలి. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అందువల్ల జనవరి నుంచి పెన్షన్ పెంచితే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. పెంచకపోతే మాత్రం పెన్షన్ దారులను మోసం చేసినట్లే అవుతుంది. అందుకే.. పెంపు ఎప్పుడా అని వారు ఎదురుచూస్తున్నారు.
కాగా, ఇక ఈరోజు నుంచి మహబూబ్ నగర్‌లో “రైతు పండగ” జరుగనుంది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా నేటి నుంచి మహబూబ్ నగర్‌లో ‘రైతు పండగ’ జరుగనుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగనున్నాయి.