Pawan Kalyan: నూకాంబికా అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న పవన్
జనసేన విజయం సాధించడంతో అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం సాధిస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తానని వేడుకున్న పవన్ ఈ రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 05:36 PM, Mon - 10 June 24

Pawan Kalyan: అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉన్నారు. జనసేన పోటీ చేసిన మొత్తం 22 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అలాగే పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది.
జనసేన విజయం సాధించడంతో అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం సాధిస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తానని వేడుకున్న పవన్ ఈ రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి తన మొక్కును తీర్చుకున్నారు. . అయితే తనతో పాటు ఆలయానికి రావద్దని ముందుగానే పార్టీ క్యాడర్‌కు చెప్పారు. పవన్ కళ్యాణ్ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు చేసి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం కానున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు, అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లనున్నారు.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్..