AP : వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చిన పవన్ కళ్యాణ్ ..
గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని
- Author : Sudheer
Date : 12-08-2023 - 2:47 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత మరోసారి వాలంటీర్లఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వాలంటీర్లు..దండుపాళ్యం బ్యాచ్ ల మారిపోయారని ఆయన ఆరోపించారు. రీసెంట్ గా వైజాగ్ లో ఓ వాలంటీర్.. వరలక్ష్మీ (Varalakshmi ) అనే వృద్ధురాలిని హత్య చేసి నగదు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం వరలక్ష్మి కుటుంబాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ (Dandupalyam batch) కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ (AP Volunteer) ఉద్యోగానికి పోలీసు వెరిఫికేషన్ చేయాలన్నారు. కొంతమంది వాలంటీర్ల నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చాలా చోట్ల వాలంటీర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తమపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తుందని అన్నారు. వృద్ధురాలు చనిపోయిన రోజులు గడుస్తున్నా ఇంతవరకు నేతలెవరూ వచ్చి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించకపోవడం దారుణం అన్నారు.
మరోసారి వాలంటీర్లపై పవన్ ఆరోపణలు చేయడం తో ..ఈరోజు సాయంత్రం వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తారు కావొచ్చు. వాలంటీర్లను దండుపాళ్యం పోల్చుతావా..ఈ వాక్యాలను మీము ఖండిస్తున్నాం..దీనిపై పవన్ నోటీసులు అందిస్తామని అంటారు కావొచ్చు.
పెందుర్తి నియోజకవర్గంలో @YSRCParty వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి (72) కుటుంబాన్ని పరామర్శించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra pic.twitter.com/48GyRlVKOl
— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 12, 2023