Pawan Kalyan: ‘ఖిలాడీ’ డైరెక్టర్ కు ‘పవన్’ గ్రీన్ సిగ్నల్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ... యమా స్పీడ్ గా వాటిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆలోగానే ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.
- By Hashtag U Published Date - 09:57 PM, Wed - 9 February 22

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ… యమా స్పీడ్ గా వాటిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆలోగానే ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త దర్శకులకు సైతం అవకాశాలిస్తున్నారు పవన్. ఇక తాజాగా పవర్ స్టార్ నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ ఫిబ్రవరి 25 న లేదంటే… ఏప్రిల్ 1 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజెనెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కి అవసరమైన సెట్స్ కూడా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్నాయి. ఈ నెలలోనే మళ్లీ పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ‘హరిహర వీరమల్లు’ ను కూడా ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ కూడా సెట్స్ మీదకి వెళ్లనుంది.
హరీశ్ శంకర్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లైన్లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ 50 రోజుల కాల్షీట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా అవ్వగానే… రవితేజతో ‘ఖిలాడి’ సినిమాని తీస్తున్న దర్శకుడు రమేశ్ వర్మతో ఓ సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంద. ఈ సినిమా నిర్మాత కూడా పవన్ తో సినిమా చేసేందుకు ఆశక్తిగా ఉన్నట్లు… పవన్ కోసం ఒక లైన్ రెడీ చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.