Kolkata : కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య
కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 48 ఏళ్ల రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోని మూడో అంతస్తులో రోగి ఉరివేసుకుని
- By Prasad Published Date - 07:20 AM, Sat - 11 March 23

కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 48 ఏళ్ల రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోని మూడో అంతస్తులో రోగి ఉరివేసుకుని కనిపించాడు. అడ్మిట్ అయిన రోగి ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. మృతుడు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన మనోరంజన్ బిస్వాస్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 8న ఆసుపత్రిలో చేరిన బిశ్వాస్‌కు ఫిబ్రవరి 24న వెన్నుపూస చికిత్స జరిగింది. వృత్తి రీత్యా, బిస్వాస్ కూలీగా ఉండేవాడు. గత సంవత్సరం అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయాడు. అనారోగ్యం కారణంగా డిప్రెషన్‌లో ఉండొచ్చని, ఆ కారణం చేత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Related News

Road Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు