Speed News
-
ChandraBabuNaidu: బీజేపీ వద్దంటే..కాంగ్రెస్ కావాలంటుంది! రాహుల్ సభకు బాబుకు ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వీడినా ఆ పార్టీ ఆయన్ను వదల్లేదు.
Date : 29-01-2023 - 5:25 IST -
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
పాకిస్థాన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో.. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది.
Date : 29-01-2023 - 2:41 IST -
Minister Injured In Firing: బ్రేకింగ్.. మంత్రిపై దుండగుల కాల్పులు
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా దాస్ (Minister Naba Das)పై దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిరానగర్‌లోని గాంధీ చౌక్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Date : 29-01-2023 - 1:03 IST -
Jr NTR and Kalyan Ram: తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. తారకరత్న హెల్త్‌పై ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
బెంగుళూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న(Taraka Ratna)ను సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆదవారం పరామర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరుకు చేరుకున్నారు.
Date : 29-01-2023 - 12:11 IST -
Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుగ్రామ్ పోలీసులు నైట్‌క్లబ్‌పై రైడ్ చేశారు. ఈ రైడ్‌లో 288 మందిని అదుపులోకి తీసుకున్నారు. నైట్ క్లబ్‌లో హెరాయిన్, కొకైన్,
Date : 29-01-2023 - 11:42 IST -
Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
Date : 29-01-2023 - 9:14 IST -
America : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు.. ఒక్క నెలలో ఆరు సార్లు..!
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన
Date : 29-01-2023 - 8:40 IST -
Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (Former minister Vatti Vasantha Kumar) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు వసంత కుమార్.
Date : 29-01-2023 - 7:18 IST -
Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
వాయువ్య ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో శనివారం రాత్రి సంభవించిన భూకంపం (Earthquake) సంభవించింది. ఇది భారీ విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.టిఆర్‌టి వరల్డ్ ప్రకారం.. భూకంపంలో ఏడుగురు మరణించారు.
Date : 29-01-2023 - 7:07 IST -
2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్‌లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
Date : 28-01-2023 - 11:51 IST -
Fierce fire in Dhanbad: ధన్బాద్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి.. మృతుల్లో వైద్య దంపతులు కూడా
ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు.
Date : 28-01-2023 - 10:20 IST -
Amshala Swamy Passes Away: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ దిగ్భ్రాంతి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. స్వామి (Amshala Swamy) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (IT Minister KTR) తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంశాల స్వామి మృతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Date : 28-01-2023 - 9:35 IST -
Chennai : చెన్నైలో విషాదం.. భవనం గోడ కూలి టెక్కీ మృతి
చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం గోడ పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మృతురాలు మధురైకి చెందిన పద్మప్రియగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియ తన స్నేహితురాలితో కలిసి థౌజండ్ లైట్స్ మెట్రో స్టేషన్ నుంచి తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై గోడ పడడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్
Date : 28-01-2023 - 8:57 IST -
Taraka Ratna : మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుపత్రికి తారకరత్న
యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైయ్యారు. అయితే కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో
Date : 28-01-2023 - 7:47 IST -
Hyderabad : సైబరాబాద్‌లో వ్యభిచార ముఠాగుట్టు రట్టు.. 8 మంది అరెస్ట్
వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను
Date : 28-01-2023 - 7:36 IST -
Gold, Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శనివారం భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి 28న హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,270గా నమోదైంది.
Date : 28-01-2023 - 7:10 IST -
China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!
భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..
Date : 27-01-2023 - 9:38 IST -
Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?
టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర "యువగళం" లో మొదటి రోజే అనూహ్య సంఘటన జరిగింది.
Date : 27-01-2023 - 8:23 IST -
HR Job: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్యోగాలు ఊడుతుండటం తెలిసిందే. టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి భారీస్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి.
Date : 27-01-2023 - 8:19 IST -
Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?
ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది.
Date : 27-01-2023 - 7:56 IST