Jr NTR and Kalyan Ram: తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. తారకరత్న హెల్త్‌పై ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
బెంగుళూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న(Taraka Ratna)ను సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆదవారం పరామర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరుకు చేరుకున్నారు.
- Author : Gopichand
Date : 29-01-2023 - 12:11 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగుళూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న(Taraka Ratna)ను సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు (Jr NTR and Kalyan Ram) ఆదివారం పరామర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరుకు చేరుకున్నారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ బెంగళూరుకు వెళ్లగా.. వారిని కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ రిసీవ్ చేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆసుపత్రిలో తారకరత్నను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పరామర్శించారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కూతురులతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కర్ణాటక మంత్రి వైద్యులతో మాట్లాడారు. తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి జూనియర్ ఎన్టీఆర్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన ఎక్మోపై లేరని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అయితే క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొన్నారు. సమస్య నుంచి బయటపడేందుకు తారక్ పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?
మరోవైపు.. నందమూరి తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం స్టెంట్ వేసే అవకాశం లేదని బాలకృష్ణ వెల్లడించారు.