Deadly Earthquake: ఘోర విషాదం.. 95 మంది మృతి.. 200 మందికి గాయాలు
టర్కీలోని నూర్దగికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం (Earthquake) సంభవించింది. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భూకంపం సిరియాలో కూడా భారీ విధ్వంసం సృష్టించింది. టర్కీలో కనీసం 53 మంది, పొరుగున ఉన్న సిరియాలో 42 మంది మరణించారని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
- By Gopichand Published Date - 10:15 AM, Mon - 6 February 23

టర్కీలోని నూర్దగికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం (Earthquake) సంభవించింది. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భూకంపం సిరియాలో కూడా భారీ విధ్వంసం సృష్టించింది. టర్కీలో కనీసం 53 మంది, పొరుగున ఉన్న సిరియాలో 42 మంది మరణించారని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మలత్యా ప్రావిన్స్‌లో 23 మంది, ఉర్ఫాలో 17 మంది, ఉస్మానియేలో ఏడుగురు, దియార్‌బాకిర్‌లో ఆరుగురు మరణించారని, భారీ నష్టం కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సిరియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అనేక భవనాల్లో కనీసం 42 మంది మరణించారు. “ప్రాథమిక భూకంపం కారణంగా అలెప్పో, హమా, లటాకియాలో 42 మంది మరణించారు. 200 మంది గాయపడినట్లు నివేదించబడింది” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిని తెలిపినట్లు SANA వార్తా సంస్థ తెలిపింది. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 04:17 గంటలకు సుమారు 17.9 కిలోమీటర్లు (11 మైళ్ళు) లోతులో సంభవించింది.
Massive #earthquake registered M7.8 hit the middle of Turkey. pic.twitter.com/mdxt53QlQ0
— Asaad Sam Hanna (@AsaadHannaa) February 6, 2023
సోమవారం దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం టర్కీకి తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా. ఈ ప్రాంతం గాజియాంటెప్ సమీపంలో ఉంది. ఈ ప్రాంత జనాభా దాదాపు 20 లక్షలు, అందులో 5 లక్షల మంది సిరియన్ శరణార్థులు. భూకంపం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.