NCBN Security: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు రక్షణపై ఎన్‌ఎ్‌సజీ సమీక్ష చేపట్టింది.
- Author : Hashtag U
Date : 26-08-2022 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు రక్షణపై ఎన్‌ఎ్‌సజీ సమీక్ష చేపట్టింది. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎన్‌ఎ్‌సజీ బృందం రక్షణ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆయన భద్రతా ఏర్పాట్లలో లోపాలు చోటుచేసుకుంటున్నాయని ఫిర్యాదులు రావడంతో.. ఎన్‌ఎ్‌సజీ డీఐజీ సమర్‌దీప్ సింగ్ గురువారమిక్కడకు వచ్చారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి భద్రతా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ విషయమై ఎమ్మెల్యే అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘భద్రతా లోపాలను సవరించడానికే ఆ విభాగం డీఐజీ ఇక్కడకు వచ్చారు. ఆయన భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి లేని శ్రద్ధ కేంద్రానికి ఉండడం అభినందనీయం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న వరుస దాడులను ఎన్‌ఎ్‌సజీ పరిగణనలోకి తీసుకుంది. డబ్బులిచ్చి మరీ ఆయనపై దాడులకు ప్రోత్సహిస్తున్నారన్న అంశం కూడా దాని దృష్టిలో ఉంది. ఈ అంశాన్ని ఎన్‌ఎ్‌సజీ అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు’ అని చెప్పారు.