HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nris Should Come Together For The Victory Of Brs Minister Ktr

KTR: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలి- మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

  • Author : Balu J Date : 28-10-2023 - 6:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

KTR: భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారితో కలిసి కదం తొక్కి తెలంగాణ సాధించుకొని, తెలంగాణ నిర్మాణంలోనూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సందర్భంలోనూ మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు. ఈరోజు భారత రాష్ట్ర సమితికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నా ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతంగా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసిఆర్ గారి నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్ అన్నారు. రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలలో కెసిఆర్ గారి ఆధ్వర్యంలో సాధించిన ప్రగతి దృష్టిలో ఉంచుకొని ప్రజల మద్దతు కోరాలని ఎన్నారైలకు సూచించారు. ఇందుకోసం తమ తమ సామాజిక మాధ్యమాల ఆధారంగా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాలలో మరింత చురుగ్గా ఉంటూ, తెలంగాణ రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hyderabad
  • ktr
  • NRIs

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Hawala Cash

    Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Food Safety

    Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్‌లో బయటపడిన షాకింగ్ లోపాలు

Latest News

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd