HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nris In South Africa Told To Sign Up As Overseas Electors Ec

NRIs: ఎన్నారైలకు ఓటు హ‌క్కు

ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో నివ‌సిస్తోన్న భార‌తీయుల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించే ఆలోచ‌న కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంది.

  • Author : CS Rao Date : 22-04-2022 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka Election
Evm

ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో నివ‌సిస్తోన్న భార‌తీయుల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించే ఆలోచ‌న కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంది. ప్ర‌స్తుతానికి విదేశీ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాల‌ని ఎన్నారైల‌ను ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర కోరారు. విదేశీ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) సదుపాయాన్ని పొడిగించే ఆలోచన ఉంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఇటీవల దక్షిణాఫ్రికా, మారిషస్‌లో పర్యటించినప్పుడు ఎన్‌ఆర్‌ఐల కోసం పోస్టల్ బ్యాలెట్‌ల ప్రతిపాదన గురించి ఆలోచించినట్లు ఈసీ చంద్ర చెప్పారు. ఆయ‌న నేతృత్వంలో ప్రతినిధి బృందం ఏప్రిల్ 9 నుండి 19 వరకు దక్షిణాఫ్రికా , మారిషస్‌లను సందర్శించింది.

NRIలకు ఆన్‌లైన్ ఓటింగ్‌ను అనుమతించే అవకాశాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఆ విష‌యాన్ని మార్చిలో లోక్‌సభకు న్యాయ మంత్రి కిరెన్ రిజిజు తెలియజేసిన విష‌యాన్ని ఈసీ చెప్పింది. ఎన్ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి అనుమతించాలని 2020లో న్యాయ మంత్రిత్వ శాఖకు EC లేఖ రాసింది. ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇత‌ర దేశ పౌరసత్వాన్ని పొందనంత వరకు విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నారైల‌కు ప్రస్తుతం EC అనుమతిస్తోంది. అయితే, వారు ఓటింగ్ రోజున వ్యక్తిగతంగా ఓటు వేయడానికి సంబంధిత పోలింగ్ బూత్‌లకు చేరుకోవాలి. దీనికి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను కేంద్రం ప‌రిశీలిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Election commission
  • india
  • NRI
  • voting

Related News

UPI One World

విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

ఈ వాలెట్ ద్వారా వారు భారతదేశంలోని ఏ దుకాణదారుడికైనా QR కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • T20 World Cup 2026

    భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

  • Sachin Tendulkar

    అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

  • America

    అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

  • మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?

  • AM/NS India : సరికొత్త ప్రీమియం స్టీల్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా’

  • ‘ The February Edit ‘ : ఇనార్బిట్ మాల్ లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ ఉత్సవం

Trending News

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd