Breaking : జింఖాన గ్రౌండ్స్ లో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది-డీసీపీ నార్త్ జోన్
సికింద్రాబాద్ జింఖాన మైదానంలో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద లో చికిత్స పొందుతుందని . నార్త్ జోన్ అదనపు డీసీపీ తెలిపారు.
- By hashtagu Published Date - 01:05 PM, Thu - 22 September 22

సికింద్రాబాద్ జింఖాన మైదానంలో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద లో చికిత్స పొందుతుందని . నార్త్ జోన్ అదనపు డీసీపీ తెలిపారు. క్రీడా శాఖ మంత్రి ముందుగానే స్పందించి ఉంటే ఇలాంటి ఘటన జరగకపోయేదని జనాలు మండిపడుతున్నారు. … అభిమానుల కోసం భారీ కెడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్లు పాటించే విధంగా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.
Over 20 people were injured in the lathi charge by police as the crowd went out of control at #Gymkhana Grounds. The mad rush for #IndiavsAustralia #T20 match tickets led to utter chaos.@HashtaguIn pic.twitter.com/y43KFU1gDA
— dinesh akula (@dineshakula) September 22, 2022
నగరంలోని జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో 20 మంది సృహతప్పిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురవాడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వచ్చే ఆదివారం ఉప్పల్ వేధికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో హెచ్‌సీఏ విక్రయిస్తున్నది. దీంతో అభిమానులు పెద్దసంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.
Related News

1 Killed : అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మునిగి మృతి చెందినట్లు అతని