HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Narender Wife Petition Against The Police In The High Court

Lagacharla incident : పోలీసులపై హైకోర్టులో నరేందర్‌ భార్య పిటిషన్

డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు.

  • Author : Latha Suma Date : 21-11-2024 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana High Court Jobs

Contempt of Court Petition : వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులుగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపు(శుక్రవారం) విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, అరెస్ట్ సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. కాగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని తెలిపారు.

మరోవైపు తెలంగాణ హైకోర్టు పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విధానంపై తప్పుపట్టింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా అరెస్టు తీరును తప్పుపట్టింది. ఇక కేబీఆర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అంటూ.. పీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని.. తీవ్ర గాయాలపై రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లుగా రాశారని హైకోర్టు పేర్కొంది.

Read Also: TTD : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. శ్రీవాణి టికెట్లు పెంపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Contempt of Court Petition
  • Lagacharla Incident
  • Patnam Narender Reddy
  • Patnam Shruti
  • Telangana High Court

Related News

Danam Nagender

Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

Danam Nagender  బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహే

    Latest News

    • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

    • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

    • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

    • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

    • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd